H.No:8-9-127/10/A, YESUNADHAPURAM STREET, ALLAGADDA NANDYAL (Dist), A.P-518543
Follow us:
About Founder

Ratna Raju Jestadi

Read in / భాష:
Ratnaraju

నా పేరు జేష్ఠది. రత్నరాజు నేను కడప జిల్లా మైదుకూరు నందు03-05-1974 లో జన్మించిన ను. మా తల్లి తండ్రి వ్యవసాయ కూలీలు వీరి పేరు చెన్నయ్య మిరియమ్మ వీరి యొక్క రెండవ సంతానము నేను, మా తల్లి మరియు తండ్రి వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు నా బాల్యమంతా మైదుకూరు నందు జరిగింది నేను డిగ్రీ వరకు చదివినాను మా తల్లి మరియు తండ్రి నన్ను చాలా ప్రేమతో పెంచడం జరిగింది. నేను కూడా వారికి సహాయకుడిగా ఉండే వాడిని, నేను కూడా పనికి వెళ్లడం ద్వారా వచ్చిన డబ్బుతో నాకు అవసరం అయినా బుక్స్ బట్టలు తెర్చుకొనే వాడిని అంతే కాదు నాతోటి ఉన్న నాకంటే పేదవాడికి సహాయం చేసే వాడిని, అలా చేస్తూ అందులో ఆనందం పొందే వాడిని,నేను ఇంటర్ చదివే రోజుల నుండి సోషల్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం.. అనేక సోషల్ ఆక్టివిటీస్ నందు పలుపొండేవాడిని, ఇది నాకు చాలా సంతోషం ఇచ్చేది.

1997 జులై 24 న నాకు వివాహం జరిగింది, నా భార్య పేరు mercy ఈమె చాలా ప్రేమ గలది. అంతే కాదు నా భార్య గవర్నమెంట్ సెక్టార్ నందు టీచర్ గా పని చేస్తుంది వివాహం తర్వాత మేము కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ -518543 నందు స్థిరపడను.1997 జనవరి నందు ఉద్యోగం వచ్చింది. ఆ రోజు నుండి ఇంత వరకు నిరుపేద మరియు చదువు లేని గ్రామాలలో పని చేస్తుంది. 1st to 5th class వరకు స్కూల్ నందు తరగతులు ఉంటాయి. పేద మరియు చిన్న పిల్లలకు మంచి భవిష్యత్ అందిచ్చేటందుకు ప్రమోషన్ కూడా వదులుకుంది. తను పని చేసిన స్కూల్స్ అన్ని కూడా spl schools. (Sc, st అంటరాని వారు ) మాకు ఇద్దరు సంతానం ఒకరు 1999 మే 14 విక్యత్ జన్మించాడు. 2001 మార్చి 21 శ్రీ వికాస్ నందు జన్మిచ్చినారు.

2001 ఆగస్టు నెలలో నేను లోకేశ్వర రూరల్ సొసైటీ నందు వాలెంటరీ గా నా జీవితం మొదలు పెట్టినాను, 2004 నందు బర్త్డే సొసైటీ నందు ఈ దినం వరకు పని చేస్తున్నాను. కొన్ని రోజులు ఫైనాన్స్ sector నందు బ్రాంచి manger గా పని చేసినాను. 2009 నుండి ఇంటర్నేషనల్ compassion నందు project co- ordinator గా పని చేస్తూ నా జీవితంలో మళ్ళీ రానంటి ఆనందం పొందిన్నాను. మా project పేరు IN484 Josiah cdc, ఇందులో 5 cdf (child development facisilator ) పని చేసే వారు. ఇందులో 217 మంది చిన్న పిల్లలు ఉండే వారు వీరి వయసు 3 నుండి 8 ఇయర్స్ వారిని చేరిపిచుకోవడం జరిగింది వీరంతా రోడ్ మీద ఆడుకునే వారు, కొంతమంది వీదుల వెంట తిరిగి వారు అన్నం ఆడుకుని కడుపు నింపుకొనే వారు మరి కొంతమంది రోడ్డు మీద చిత్తూకాగితాలు మరియు ప్లాస్టిక్ పేపర్స్ ఎరుకొనే వారు, ఇలాంటి వారిని సేకరించి వారికి ప్రతి రోజు భోజనం పెట్టి మంచి స్కూల్స్ నందు చేరిపించాము. వారు ఈ రోజు కొంతమంది మంచిగా చదివి వారి జీవితం కుటుంబ పరిస్థితులు మార్చున్నారు. వారి యొక్క స్థితి గతులు మారడానికి మేము అందించిన విద్యా. విద్యా ద్వారా పామరులను కూడ మార్చాగలము. నాకు ఈ లాంటి అవకాశం ఇచ్చిన birds సొసైటీ కి మరియు ఇంటర్నేషనల్ compassion కు నేను వందనాలు చెల్లిస్తున్నాను,. నేను మహానంది జోన్, అల్లగడ్డ రోటరీ క్లబ్ 3160 నందు 2020 నుండి ఉన్నాను 2023-2024 ఇయర్ లో సెక్రటరీ గా కొనసాగిన ఇపుడు సభ్యునిగా కొనసాగుతున్నాను.

సమాజంలో ఉన్న పేదవారికి సహాయం చేయడంలో మరియు వారితో కలిసి వారి అవసరతలకు గుర్తించి వారికి సహాయ చేయడంలో ఉన్న సంతోషం ఎక్కడ నాకు లభించలేదు.

సమాజంలో మార్పు రావడానికి ముఖ్యముగా విద్య , వైద్య, వ్యవసాయం, త్రాగడానికి నీరు, కనీస అవసరాలు తెర్చుకోవడానికి, చేతి పనులు నేర్పించడం మొ"" అందించ గలిగితే ఉజ్వల భవిష్యత్ ను యువతకు ఇవ్వగలం

మీకు ఒక విషయం చెప్పనా నా వద్ద ఆర్థిక స్థోమత లేదు, కానీ సొసైటీ కోసం పనిచేయటానికి ప్రేమ ఓర్పు సహనం నాకు ఉన్నాయి. ఆర్థికముగా సమాజం కోసం పనిచేయాలి అనే వారితో పనిచేయటం నాకు మరి ఎక్కువగా సంతోషం. అంతేకాదు నాకు ఇంకొక్క కోరిక ఉంది అది ఏమిటి అంటే సమాజంలో క్యాన్సర్ తో బాధపడుతున్న పేద కుటుంబాలు చాలా ఉన్నాయి, వారియొక్క కనీస అవసరాలు తెర్చుకోలేక చాలా బాధ పడుతున్నారు, వారికోసం ఒక ఆయుర్వేద వైద్యం చెయ్యాలి అని వుంది, ఆయుర్వేదం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆర్థిక స్తోమత లేని వారికి ఆయుర్వేద వైద్య శాల ద్వారా వైద్యం అందించాలి అనే ఆశ నాకు ఉంది దీనికి కూడా నా వద్ద ఆర్థిక పరమైన వనరులు నా వద్ద లేవు. మా పూర్వీకులు ఆయుర్వేద ఇంటి వైద్యం చేసేవారు వారి నుండి నేను కూడా కొద్ది వరకు వైద్యం నేర్చుకున్నాను ఇది నా పార్ట్ టైం పనిగా చేస్తూ ఉన్నాను.... సమాజం కోసం పని చేయాలి అనే మీ కోరికకు నా చేతులు జత కలిపి మీ కలలు నిజరూపం దాల్చడానికి నాకు ఉన్న ప్రేమను సహనాన్ని ఓర్పును కలిపి మీ కలలు నిజరూపం దాల్చటానికి నేను పని చేయగలను.

భవిత ఉజ్వల భవిష్యత్ కోసం, నూతన సమాజం కోసం అన్నీ రకాల సమాజ సేవలు అందించడానికి నేను సిదం
"సంతోషకరమైన సమాజం కోసం భవిత సంతోషకరమైన ఆనందకరమైన జీవితం కోసం పనిచేద్దాం. Ratna innovation foundation ద్వారా మీ కలలు నిజరూపం దాల్చటానికి మీ వెంట ఉంటాను"

ఇట్లు
రత్న రాజు

1
👋 Hi!
Want to support a cause?

Ratna Foundation

🟢 Online
Hello! How can we help you make a difference today?